ప్రియాంక మృతికి నిరసనగా పిఠాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ
పిఠాపురం : ప్రియాంక మృతికి నిరసనగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పిఠాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగిస్తూ కోటగుమ్మం సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రియాంక అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. తల్లిదండ్రుల కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతే వారి వేదన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఈ విధంగా మృత్యువాత పడటం బాధాకరమన్నారు. మద్యం మత్తులో యువత ఘర్షణలకు దిగడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పిఠాపురం గౌరవ అధ్యక్షుడు కె. అప్పారావు, అధ్యక్షుడు టి. సూరిబాబు, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్ వి. సూర్యనారాయణ, వై. నానిబాబు, ప్రజాసంఘాల నాయకులు కరణం విశ్వనాథం, జి. ప్రసాద్ తదిత...